బాలీవుడ్ (Bollywood) మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే కళ్ళు చెదిరే వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ (Ranveer Singh) పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మరియు ఆదిత్య ధర్ (Aditya Dhar) మేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.
కాగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ను అధికారకంగా ప్రకటించింది జియో స్టూడియోస్ (Jio Studios). భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ. 145 కోట్లతో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజు రూ. 83 కోట్లు కొల్లగొట్టగా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో రూ. 117 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం నాలుగో రోజు రూ. 121 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కేవలం ఇండియాలోనే మొత్తం రూ. 466 కోట్ల నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్స్ నిలకడగా ఉండటం ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది.
అటు ఓవర్సీస్ మార్కెట్‌లో (Overseas Market) కూడా ‘ధురందర్’ (Dhurandhar) ప్రభంజనం కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ. 211 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 761 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2026లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రూ. 550 కోట్లు ఇండియన్ మార్కెట్ నుండి రాబట్టిందంటే ధురంధర్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ. 2000 మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.








