విజయ్‌కు మరో షాక్.. ‘జననాయగన్’ ఆ డీల్ రద్దు?

విజయ్‌కు మరో షాక్.. ‘జననాయగన్’ ఆ డీల్ రద్దు?

Summarize with AI

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)కు మరో భారీ షాక్ తగిలిందని కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘జననాయగన్’ (Jananayagan) సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinoth) తెరకెక్కించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అన్న ప్రచారం ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ పలుమార్లు దాన్ని ఖండించింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సుమారు ₹120 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, సినిమా నిర్ణయించిన సమయానికి విడుదల కాకపోవడం మరియు సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు (Deal Cancelled) సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ‘జననాయగన్’ విడుదలపై, అలాగే విజయ్ సినిమా భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment