IPL షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. ఓపెనింగ్ మ్యాచ్ RCB vs CSK?

IPL షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. ఓపెనింగ్ మ్యాచ్ RCB vs CSK?

Summarize with AI

క్రికెట్ అభిమానులను (Cricket Fans) ఉత్సాహపరిచే వార్త బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన ఐసీసీT20 ప్రపంచ కప్ ముగియగా, ఇండియా టీం మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం IPL (IPL – Indian Premier League) పై పడింది. తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 13 నాటికి తొలి దశ షెడ్యూల్ (Schedule) బయటకు రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మార్చి 28న బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB మరియు CSK మధ్య హై వోల్టేజ్ పోరు జరగే అవకాశం ఉందని సమాచారం. సాధారణంగా గత సీజన్ ఫైనలిస్టుల మధ్యే తొలి మ్యాచ్ నిర్వహిస్తారు. కానీ ‘సౌత్ ఇండియన్ డెర్బీ’ (South Indian Derby)గా పిలిచే ఆర్‌సీబీ–సీఎస్‌కే మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో ఈ మ్యాచ్‌తోనే టోర్నీని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. అలాగే ఈ నెల 15న ఢీల్లీ లో కెప్టెన్ల ఫొటో షూట్, 25న ముంబాయి లో కోచ్‌లు మరియు కెప్టెన్లతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment