ఇరాన్ పై యుద్ధం మొదలు

ఇరాన్ పై యుద్ధం మొదలు

Summarize with AI

మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా (United States) హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ (Tehran)పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. టెహ్రాన్ అంతటా అనేక పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఇజ్రాయెల్‌పై కూడా ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. దీంతో టెల్ అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది. ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ (Israel Defense Minister Katz) తెలిపారు. ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్‌లో ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అలాగే ఎయిర్‌స్పేస్ కూడా క్లోజ్ చేసేసింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఊహించని రీతిలో దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్‌‌ నగరంపై అనేక చోట్ల క్షిపణిలను ప్రయోగించినట్లుగా సమాచారం. మొత్తం నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. టెహ్రాన్‌లో ప్రధాన కేంద్రాలే లక్ష్యంగా దాడి చేసనట్లు సమాచారం. ఇక ఇరాన్‌పై దాడులను ఇరాన్ టీవీ ఛానెల్స్ కూడా ధృవీకరించాయి. డజన్ల కొద్దీ క్షిపణులు విరుచుకపడినట్లుగా పేర్కొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment