ఏపీ పోలీసులకు షాక్.. సునీల్ నాయ‌క్‌కు అండ‌గా బిహార్ ప్ర‌భుత్వం

bihar-government-checks-ap-police-action-on-ips-sunil-naik

Summarize with AI

ఏపీ ప్ర‌భుత్వ (Andhra Pradesh Government) దూకుడుకు బిహార్ ప్ర‌భుత్వం (Bihar Government) చెక్ పెట్టింది. పోలీసుల‌పై రాజ‌కీయ వేధింపులు స‌రికాదంటూ ఏకంగా కీల‌కమైన నిబంధ‌న క్రియేట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆంధ్రప్రదేశ్–బిహార్ మధ్య నెల‌కొన్న వ్య‌వ‌హారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి (IPS Officer) సునీల్ నాయ‌క్‌పై(Sunil Nayak) ఏపీ పోలీసుల చర్యల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ పోలీసుల దూకుడు
ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసులు (AP Police) అరెస్టు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో, బిహార్ ప్రభుత్వం పోలీసు అధికారులపై రాజకీయ వేధింపులను అరికట్టే దిశగా ముందడుగు వేసింది. అధికారిక విధులు నిర్వహించే సమయంలో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదురైతే, ముందుగా బిహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 218 కింద బిహార్ పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు లభించే రక్షణ తరహాలోనే బిహార్ పోలీసులకు కూడా ప్రభుత్వ పరిరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంది.

సునీల్ నాయక్ వ్యవహారం నేపథ్యం
రఘురామ కృష్ణంరాజును (Raghurama Krishnam Raju) కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణల కేసులో సునీల్ నాయక్ పేరును ఏపీ పోలీసులు ప్రస్తావిస్తూ ట్రాన్సిట్ రిమాండ్ కోరారు. అయితే ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరించిన నేపథ్యంలో, ఇతర మార్గాల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదుల ద్వారా అధికారులను వేధించకుండా నిరోధించేందుకు బిహార్ ప్రభుత్వం ముందస్తు అనుమతి విధానాన్ని అమలు చేసింది. కేసులను సమీక్షించిన తరువాతే అనుమతి ఇవ్వాలనే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

అధికారిక నోటిఫికేషన్
హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఏకే సింగ్ (A.K. Singh) ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పాట్నా హైకోర్టు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సబ్ డివిజనల్ అధికారులకు పంపినట్లు సమాచారం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రాల మధ్య అధికారుల వ్యవహారాల్లో ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం అరుదుగా జరుగుతుండటంతో, ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment