తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు

తమిళనాడులో (Tamil Nadu) ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే (DMK), అన్నాడీఎంకేల (AIADMK) మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ (Vijay Party) టీవీకే(TVK)ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది. తాజాగా, అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం (O. Panneerselvam(ఓపీఎస్), డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను కలవడం సంచలనంగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన సమావేశం ఆసక్తిని పెంచింది.

దివంగత విజయ్‌కాంత్ డీఎండీకే పార్టీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఇప్పుడు పన్నీర్ సెల్వాన్ని డీఎంకేలోకి తీసుకురావడానికి ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసమే పన్నీర్ సెల్వంతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఓపీఎస్ కుమారుడు కూడా ఉన్నాడు. ఎన్డీయేలో చేరకుండా స్వతంత్రంగా ఉండగలరా? అని స్టాలిన్ ఓపీఎస్‌ను అడిగినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఓపీఎస్‌తో ఓవైపు చర్చలు జరుగుతున్న సందర్భంలోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి. అయ్యప్పన్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఓపీఎస్-స్టాలిన్ సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఎంజీఆర్, జయలలిత ఆశీస్సులు స్టాలిన్‌కు ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment