భోపాల్‌లో ‘శుభలగ్నం’ సినిమా రిపీట్‌.. భ‌ర్త‌ను అమ్మేసిన భార్య‌

‘శుభలగ్నం’ సినిమా స్టైల్‌లో నిజజీవిత ఒప్పందం

Summarize with AI

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో సంచలనం సృష్టించిన కుటుంబ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 42 ఏళ్ల వ్యక్తి 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం బయటపడింది.

దీనిపై ఆ వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించగా, కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఇరువురికి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే భార్యతో కలిసి జీవించేందుకు భర్త స్పష్టంగా నిరాకరించడంతో వివాదం మరింత మలుపు తిరిగింది.

చివరికి పరస్పర అంగీకారంతో విడిపోవడానికి భర్త రూ.1.5 కోట్లు నగదు, అదనంగా రూ.27 లక్షలు మరియు ఒక ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. భార్య చేసిన ఈ డిమాండ్లకు అంగీకరించడంతో, ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని విన్న ప్రతి ఒక్కరూ శుభలగ్నం సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. కుటుంబ వ్యవహారం ఇలా భారీ ఆర్థిక సెటిల్‌మెంట్‌తో ముగియడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment