జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

Summarize with AI

జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్‌లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, 68 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి అత్యంత‌ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ టీమ్‌ను రంగంలోకి దింపారు. 100 ఫైర్ ఫైటర్స్ రంగప్రవేశం చేసి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, టెర్రరిస్టు దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment