హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ను HCA అధ్యక్షుడిగా అంబుడ్స్‌మన్ నియమించారు. గత ఎన్నికల్లో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావుకు 63 ఓట్లు రాగా, అమర్నాథ్కు 62 ఓట్లు మాత్రమే రావడంతో జగన్మోహన్ రావు HCA అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు అప్పటినుంచి చర్చనీయాంశంగా మారాయి.
శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను సృష్టించి అక్రమ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో జగన్మోహన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి ఇటీవల అరెస్ట్ చేశారు. దీంతో ఆయనను HCA అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత నుంచి HCA అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అంబుడ్స్‌మన్ తీర్పు వెలువరించి అమర్నాథ్ను HCA అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారం లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించడంతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.








