జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ఉన్న వీడియో కాల్స్ క్లిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అరవ శ్రీధర్ చీకటి బాగోతంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జనసేన పార్టీ అధికారికంగా స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా ఒక వీడియో విడుదల చేసి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న న్యూడ్ వీడియోలు అన్నీ డీప్‌ఫేక్ అని స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని అరవ శ్రీధర్ పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు ప్రచారాల ద్వారా తనను బదనాం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇక ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేపై జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.







