‘అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్’

'అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్'

వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఆమెపై ఉన్న అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఓ పూజారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అనసూయకు ఆలయం కడతా
మురళీశర్మ (Murali Sharma) అనే పూజారి, అనసూయకు వీరాభిమాని (Die-Hard Fan)గా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, గతంలో తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి కట్టినట్లుగానే అనసూయకు కూడా ఆలయం (Temple) నిర్మించాలని తమ ఆలోచనగా వెల్లడించారు. అయితే దీనికి ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు అనసూయ పర్మిషన్ (Permission) కూడా తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు. ఆమె అంగీకరిస్తే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ధీమాగా చెప్పారు.

ఇదే సందర్భంలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన శివాజీ–అనసూయ వివాదంపై కూడా మురళీశర్మ స్పందించారు. ఆ విషయంలో అనసూయ చేసిన వ్యాఖ్యలకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక నటిపై ఉన్న అభిమానంతో ఏకంగా గుడి కడతామని ప్రకటించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అంశాలపై అనసూయ సాధారణంగా చాలా స్పష్టంగా, బోల్డ్‌గా స్పందిస్తుంటుంది. మరి ఈసారి ‘అనసూయకు గుడి’ అనే ప్రతిపాదనపై ఆమె ఎలా స్పందిస్తుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment