వైఎస్ జగన్ భూ సంస్కరణలకు అంతర్జాతీయ ప్రశంస (Video)

వైఎస్ జగన్ భూ సంస్కరణలకు అంతర్జాతీయ ప్రశంస (Video)

వైసీపీ (YSRCP) అధినేత‌ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చేపట్టిన భూ సంస్కరణలకు (Land Reforms) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. దావోస్‌ (Davos)లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) చర్చాలో ఏపీ ప్రభుత్వం అమలు చేసిన క్లీన్ ల్యాండ్ టైటిలింగ్ విధానాలను ఇండియన్–అమెరికన్ ప్రముఖ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ (Gita Gopinath) బహిరంగంగా అభినందించారు.

డిబేట్ సందర్భంగా గీతా గోపినాథ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల విషయంలో చాలా బాగా చేసింది. ల్యాండ్ టైటిల్ స్పష్టత తీసుకురావడంలో, భూముల లావాదేవీలను సులభతరం చేయడంలో రాష్ట్రం ఎంతో క్రియేటివ్ విధానాలు అవలంభించింది” అని ప్రశంసించారు. ముఖ్యంగా క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం చేసిన కృషి అభినందనీయమని ఆమె స్పష్టం చేశారు. ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని గీతా గోపినాథ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ (Ashwini Vaishnaw) సమక్షంలోనే రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ దుష్ప్ర‌చారం
వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan), టీడీపీ అనుకూల మీడియా గతంలో విస్తృతంగా దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ వేదికపై జగన్ ప్రభుత్వ పారదర్శక విధానాలకు ప్రశంసలు రావడంతో ఆ దుష్ప్రచారం పూర్తిగా బట్టబయలైందని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వందేళ్లలో ఎవరూ చేయని సంస్కరణలు
నిన్న జ‌రిగిన‌ ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ మాట్లాడుతూ, గత వందేళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసోపేతమైన భూ సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని స్పష్టం చేశారు. భూముల రీ-సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి, భూ యాజమాన్యంలో స్పష్టత తీసుకొచ్చామని వివరించారు. ఈ సంస్కరణల వల్ల రైతులు, భూ యజమానులు, పెట్టుబడిదారులకు భరోసా పెరిగిందని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందని వైఎస్ జగన్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment