టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel)కు నేడు బర్తడే సందర్భంగా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లో ఇప్పటివరకు 2227 పరుగులు, 214 వికెట్లతో అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అక్షర్. 2024 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించడమే కాకుండా, ఫైనల్లో కీలకమైన 47 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) విజేతగా నిలవడంతో పాటు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపులోనూ భాగస్వామిగా నిలిచాడు.
ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే, టీ20 అంతర్జాతీయాల్లో నెం.7 స్థానంలో భారత్ తరఫున అత్యధిక స్కోరు (65) సాధించిన ఆటగాడిగా అక్షర్ రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున నాలుగో అత్యధిక టీ20ఐ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (8) సాధించగా, తన టీ20ఐ డెబ్యూలోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం. ఐపీఎల్‌లో 2014లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అక్షర్, 2016లో హ్యాట్రిక్ సాధించి అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. అలాగే ఐపీఎల్‌లో విజయవంతమైన రన్‌చేజ్‌లో 20వ ఓవర్‌లో మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన అంకితభావం, స్థిరమైన ప్రదర్శనతో టీమిండియాకు కీలక ఆయుధంగా మారిన అక్షర్ పటేల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.









ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్