చిరంజీవి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్

చిరంజీవి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్

Summarize with AI

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రత్యేక స్టిల్స్‌ను (Special Stills) మన శంకర వర ప్రసాద్ గారు విడుదల చేశారు. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విడుదలైన ఫొటోల్లో చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్ ఎనర్జీతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి చాటారు. విన్టేజ్ లుక్, సహజమైన గ్రేస్‌తో ఆయన కనిపించడం అభిమానుల మనసులను దోచుకుంటూ హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘మీసాల పిల్ల’, ‘ససిరేఖ’ చార్ట్‌బస్టర్‌లుగా మారి భారీ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన రాబట్టాయి. డిసెంబర్ చివరి వారంలో విడుదల కానున్న మూడో పాటపై అంచనాలు మరింత పెరిగాయి. హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రవిపూడి (Anil Ravipudi) ఈ చిత్రంలో చిరంజీవిని అభిమానులు ఎప్పటినుంచో చూడాలని కోరుకున్న క్లాసిక్, నాస్టాల్జిక్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ రోల్‌లో మెగాస్టార్ కనిపించనున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వినోదం, భావోద్వేగాలు, మెగాస్టార్ మ్యాజిక్‌తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించనుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment