త్వరలో తాత కాబోతున్న కింగ్ నాగ్..?

త్వరలో తాత కాబోతున్న కింగ్ నాగ్..?

Summarize with AI

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున త్వరలో తాతగా మారబోతున్నారు. ఈ వార్తలు టాలీవుడ్ కాంపౌండ్‌లో ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కింగ్ నాగార్జున్ తాత కాబోతున్నార‌నే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మొదట నాగచైతన్య-శోభిత దంపతుల గురించి రూమర్స్ వచ్చాయి, తర్వాత అఖిల్-జైనబ్ దంపతులు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా జరిగిన ఒక హెల్త్ ఈవెంట్‌లో నాగార్జునతో ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ “సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను” అని వెల్ల‌డించారు. ఆయన ఈ వార్తలను ఖండించకపోవడం వల్ల, అక్కినేని ఇంట్లో త్వరలో వారసుడు అడుగుపెట్టబోతున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

తను గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. అయితే, సర్జరీ చేయించుకోవడం మానసికంగా ఇష్టం లేక, లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ మరియు PRP చికిత్సతో మోకాలి సమస్యను పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉండే నాగార్జున, తన డైట్‌, వ్యాయామంతో ఆరోగ్య సమస్యలను అధిగమించటం అభిమానులను ఆకర్షిస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment