బీసీల‌కు రిజర్వేషన్లను తగ్గించి.. ‘దేశానికి ఆదర్శం’ అంటారా?”

బీసీల‌కు రిజర్వేషన్లను తగ్గించి.. ‘దేశానికి ఆదర్శం’ అంటారా?”

రాష్ట్ర ప్రభుత్వం (State Government) బీసీ రిజర్వేషన్లను (BC Reservations) తగ్గించి కూడా తామే దేశానికి ఆదర్శమని చెప్పుకోవడం నయవంచన అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ శాతం (Reservation Percentage) తగ్గిందని, అందుకే వెంటనే ఎన్నికల్ని వాయిదా వేసి సరిచేసే చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ (BC Commission) స్పష్టంగా సూచించినా, ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

సోమవారం ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన “బీసీల ఆత్మగౌరవ–ధర్మ పోరాట ర్యాలీ” (BCs Self-Respect – Dharma Fight Rally)కి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీకి జిల్లపల్లి అంజి (Jillapalli Anji), మోడీ రాందేవ్ (Modi Ramdev) లు నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఎన్నికలను వాయిదా వేసి, 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం ఎలా అంటారని ప్రశ్నించారు.

ప్రభుత్వం వైఖరి మార్చుకుని వెంటనే 42% అమలు చేయాలని మధుసూధనా చారి విజ్ఞప్తి చేశారు. ఈ భారీ ర్యాలీలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఆనంద్ గౌడ్, ర్యాగ రిషి అరుణ్ కుమార్, నీల వెంకటేష్, గుజ్జ సత్యం, బాణాల అజయ్, భీం రాజ్, రాజ్ కుమార్, వేణుమాధవ్, ఆశిష్ గౌడ్, నిఖిల్ పటేల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment