గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

గాజాలో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, గాజాలోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి.

ఇజ్రాయెల్ చేసిన‌ దాడుల్లో 69 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు జర్నలిస్టులు, ఐదుగురు పాలస్తీనా పౌర రక్షకులు ఉన్నారని అధికార వర్గాలు తెలుస్తోంది.

ఇలాంటి దాడులతో గాజాలో పరిస్థితి మరింత విషమించిందని అధికారులు వెల్లడించారు. పాలస్తీనా పౌరులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాల కోసం పాక్షికంగా ఇళ్లను విడిచిపెడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment