ప్రభాస్ ‘స్పిరిట్’లో కాజోల్?

ప్రభాస్ 'స్పిరిట్'లో కాజోల్?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్-కాప్ డ్రామా చిత్రం ‘స్పిరిట్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా చెక్ పెట్టారు. “నేను స్పిరిట్‌లో లేను” అని కరీనా స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.

కాజోల్‌కు వంగా ఆఫర్?
తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’లో ఒక ప్రభావవంతమైన పాత్ర కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. వంగా అందించిన స్క్రిప్ట్ కాజోల్‌ను బాగా ఆకట్టుకోవడంతో, ఆమె ఈ ప్రాజెక్ట్‌కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాజోల్ గతంలో రెండు తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు ఆమె ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. బాలీవుడ్‌లో ఆమెకున్న క్రేజ్, అద్భుతమైన నటన నైపుణ్యం ‘స్పిరిట్’కు మరింత బలాన్ని చేకూరుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment