వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా హ్యాకింగ్‌కి పాల్పడుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాట్సాప్ హ్యాకింగ్‌కి అరికట్టవచ్చు.
టు స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేయండి
మీ ఖాతా భద్రత కోసం ఇది అత్యంత కీలకం. వాట్సాప్ సెట్టింగ్స్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసి, సెక్యూరిటీ కోడ్ సెటప్ చేయండి.
తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు
మీ వాట్సాప్‌కు వచ్చిన అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం వల్ల మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది.
తెలియని వీడియో కాల్స్‌కుకు స్పందించవద్దు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ద్వారా హ్యాకింగ్ జరగవచ్చు. అలాంటి కాల్స్‌ను తక్షణమే తిరస్కరించండి.
రివార్డుల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు
ఫేక్ రివార్డుల పేరుతో పంపే లింకులు లేదా మెసేజ్‌లు మీ సమాచారాన్ని దొంగిలించేందుకు సహాయపడతాయి. కాబట్టి అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఈ జాగ్రత్తలతో మీ వాట్సాప్ ఖాతాను హ్యాకింగ్ నుంచి రక్షించుకోండి. భద్రతాపరమైన అప్డేట్స్‌కు వాట్సాప్ నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.








