చిన్న పొర‌పాటు చేసినా ఏపీకి న‌ష్టం.. – చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ

చిన్న పొర‌పాటు చేసినా ఏపీకి న‌ష్టం.. - చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ

కృష్ణా నదీ జలాలపై (Krishna River Waters) జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రస్తుత సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)కు 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, ట్రిబ్యునల్ వాదనల్లో సరైన ప్రతినిధ్యం లేకపోవడం వంటి అంశాలపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. KWDT–2 ముందున్న కీలక వాదనల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను రాష్ట్రం త‌ర‌ఫున గట్టిగా సమర్థించాల్సిన బాధ్యత కూట‌మి ప్రభుత్వంపై (Coalition Government) ఉందని గుర్తుచేశారు.

రాష్ట్రం చిన్న పొరపాటు చేసినా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. “ట్రిబ్యునల్ తెలంగాణకు 763 టీఎంసీల కేటాయింపున‌కు అంగీకరిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు భారీ అన్యాయం జరుగుతుంది” అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వాదనలు వినిపించడం ప్రభుత్వ ధర్మమని జ‌గ‌న్ ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ(TDP) ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 1996లో చంద్రబాబు సీఎం ఉన్నపుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు. “ఆ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినా, చంద్రబాబు పట్టించుకోలేదు. ఇది ఏపీ హక్కులకు నేరుగా ముప్పు తీసుకొచ్చింది” అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఆల్మట్టి ఎత్తు పెంపు అనుమతించేందుకు మార్గం సుగమం చేసిందని ఆరోపించారు.

ఇక 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కూడా కృష్ణా జల హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసిందని జగన్ విమర్శించారు. “ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది” అని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తూ, దానికి పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాదనలు వినిపించాల్సిన అవసరాన్ని జగన్ మరోసారి నొక్కి చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment