గుడిని ఆక్ర‌మించి ఏకంగా ఇల్లు క‌ట్టేశారు.. 46 ఏళ్ల త‌రువాత తెరుచుకున్న ఆల‌యం

గుడిని ఆక్ర‌మించి ఏకంగా ఇల్లు క‌ట్టేశారు.. 46 ఏళ్ల త‌రువాత తెరుచుకున్న ఆల‌యం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో 46 ఏళ్ల త‌రువాత ఒక పురాతన శివాలయం తిరిగి తెరుచుకుంది. షాహీ జామా మ‌సీద్ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం 1978 నుండి మూతబడినట్లు నగర్ హిందూ సభ నిర్వాహకుడు విష్ణు శరణ్రస్తోగి తెలిపారు.

శనివారం ఉదయం సంభాల్‌లోని షాహీ జామా మసీదు ప్రాంతంలో ఆక్రమణలు, విద్యుత్ చౌర్యంపై జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని గుర్తించి ఆ ఆల‌యాన్ని తిరిగి తెరిచారు. 1976 అల్లర్ల సమయంలో హిందూ కుటుంబానికి చెందిన మహమూద్ ఖాన్ సరాయ్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో ఈ ఆలయాన్ని గుర్తించారు.

జిల్లా మేజిస్ట్రేట్ (DM) రాజేంద్ర పెన్సియా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆధ్వర్యంలో, ఆలయాన్ని శుభ్రపరిచారు. బావి తవ్వకం ప్రారంభించారు. ఇంటి యాజమాన్యాన్ని గుర్తించేందుకు విచారణ జరుగుతోందని డీఎం పెన్సియా పేర్కొన్నారు.

షాహీ జామా మసీదు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి విద్యుత్ చౌర్యం జరగకుండా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలోని రోడ్లు, డ్రెయిన్ల ఆక్రమణలను తొలగించాలని పరిపాలన బృందం ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment