ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ టీటీడీ లెటర్ల (TTD Letters) బాగోతం బయటపడింది. ఇప్పటికే కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై మద్యం, మాంసాహారం, మందుబాబుల హల్ చల్ వంటి ఘటనలు వెలుగుచూడగా, తాజాగా దేవుడి దర్శనానికి ఉపయోగించే నకిలీ లెటర్ల సంఘటన కలకలం రేపుతోంది.
ఏపీ(AP) హెల్త్ మినిస్టర్ (Health Minister) సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) పేరుతో నకిలీ (Fake) టీటీడీ లెటర్లు (TTD Letters) జారీ అవుతున్న ఘటన బయటపడింది. గత కొన్ని రోజులుగా మంత్రి పేరుతో లెటర్లు తయారు చేస్తూ, భక్తులకు విక్రయిస్తున్నారని, బాధితులే ఈ విషయాన్ని బయటపెట్టడం గమనార్హం. ఈ విషయం మంత్రి కార్యాలయ దృష్టికి చేరింది. వెంటనే మంత్రి పీఏ సుజన్ (PA-Sujan) ఈ వ్యవహారంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (Rajasekhar Babu)కు అధికారిక ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. Cr.No.95/2025 గా నమోదు చేసిన ఈ కేసులో Section 336(3), 318(4), 319(2) BNS, అలాగే IT Act 2008 Section 66C కింద నేరపూరిత కేసులు పెట్టారు. మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ పత్రాలు తయారు చేసిన ముఠాపై పోలీసులు సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు ప్రారంభించారు.
నకిలీ టీటీడీ లెటర్లు తయారైన విధానం, పంపిన నంబర్లు, ఇమెయిల్ ట్రయిల్స్, ఐపీ అడ్రెస్‌లను పరిశీలిస్తూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.








