ఇమ్మిడి ర‌వి అరెస్ట్‌.. స్పందించిన ప‌వ‌న్‌

ఇమ్మిడి ర‌వి అరెస్ట్‌.. స్పందించిన ప‌వ‌న్‌

తెలుగు సినిమా పైరసీ ప్రపంచాన్ని కుదిపేసిన iBomma నిర్వాహ‌కుడి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్‌ పోలీసులు, ముఖ్యంగా సీపీ (CP) సజ్జనార్‌ (Sajjanar) ఆధ్వర్యంలో పనిచేసిన బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేయడంపై ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా విడుదల రోజునే నెట్‌లో పెట్టడం ద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. దర్శక–నిర్మాతలు తమ సొంతంగా పైరసీని అరికట్టలేని స్థితికి వ్యవహారం చేరుకుందని, ఇలాంటి ముఠాలు ధైర్యంగా పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి చేరుకోవడం మరింత ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో, పైరసీ ముఠాను గుర్తించి అడ్డుకున్నందుకు హైదరాబాద్‌ పోలీసులకు పవన్‌ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సజ్జనార్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఇతర రాష్ట్రాల్లోని లా–ఎన్ఫోర్స్‌మెంట్‌ సంస్థలకు కూడా కదలిక తెచ్చిందని, ఈ చర్య భారతీయ చిత్ర పరిశ్రమకు మేలుచేసే దిశగా కీలకమైన అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment