TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్

TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. 783 గ్రూప్-2 ఖాళీల కోసం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షల సమయం, పేపర్ల వివరాలు
గ్రూప్-2 పరీక్ష మొత్తం నాలుగు పేపర్లతో ఉంటుంది. ప్రతి పేపరు 150 మార్కులకు నిర్వహించబడుతుంది. మొత్తం పరీక్ష 600 మార్కులది.
పేపర్-1: డిసెంబర్ 15 ఉదయం 10:00 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM
పేపర్-2: మధ్యాహ్నం 3:00 PM నుంచి సాయంత్రం 5:30 PM
పేపర్-3: డిసెంబర్ 16 ఉదయం 10:00 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM
పేపర్-4: అదే రోజు మధ్యాహ్నం 3:00 PM నుంచి సాయంత్రం 5:30 PM

అభ్యర్థులకు సూచనలు
పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోవాలి.
పరీక్ష విధానాలు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి.
అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment