అదానీ గ్రూప్ ఏపీకి కొత్త కాదు.. – కరణ్ అదానీ

స్టార్టప్ స్టేట్‌గా ఏపీ స్థిరపడింది.. - కరణ్ అదానీ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ సదస్సును ప్రారంభించారు. దేశ–విదేశాల నుండి వచ్చిన మంత్రులు, ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ పెట్టుబడిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ సదస్సుకు హాజ‌ర‌య్యారు.

సదస్సులో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ ఏపీకి కొత్త కాదు అని వ్యాఖ్యానించారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ వేగంగా ఆధునిక రాష్ట్రంగా మారుతోంది. దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఏపీ స్థిరపడింది” అని ఆయన అన్నారు. ఏపీలో అదానీ గ్రూప్‌ ఇప్పటికే డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో విస్తృతంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, 1 లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించినట్లు కరణ్ అదానీ వెల్లడించారు.

ఏపీ అభివృద్ధిలో అదానీ సంస్థ కూడా భాగస్వామి కావడం గర్వకారణమని పేర్కొంటూ, రాష్ట్ర భవిష్యత్‌ సామర్థ్యం అపారమని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం, వ్యాపారాలకు కావాల్సిన సౌకర్యాలు, వినూత్న విధానాలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడిదారుల హాట్‌ డెస్టినేషన్‌గా ఎదుగుతోందని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment