జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ కౌంటింగ్ రేపే..

జూబ్లీహిల్స్ కౌంటింగ్ రేపే..

Summarize with AI

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల (By-Election) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ)(DEO) ఆర్‌వీ కర్ణన్‌ (R.V. Karnan) కౌంటింగ్ ఏర్పాట్లు, నిబంధనలపై కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Votes Counting) ప్రారంభమవుతుందని, మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేక అనుమతితో ఈసారి 42 టేబుల్స్‌ను ఏర్పాటు చేశామని, 186 మంది సిబ్బంది ఈ పనిలో పాల్గొంటారని పేర్కొన్నారు. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారి (RO) పర్యవేక్షిస్తారని, ఫలితాల అప్‌డేట్స్‌ను LED స్క్రీన్ ద్వారా, అలాగే ఈసీ యాప్ ద్వారా అందిస్తామని డీఈఓ స్పష్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప మరెవరికీ కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని ఆయన సూచించారు.

మరోవైపు, కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లపై జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడారు. రేపు కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని, అన్ని విభాగాల పోలీసు బృందాలను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని జాయింట్ సీపీ హెచ్చరించారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment