జూబ్లీహిల్స్ఉ (Jubilee Hills)ప ఎన్నికల (By Elections) నేపథ్యంలో సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) గట్టిగా బదులిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తనకు రేవంత్ రెడ్డి లేదా కేసీఆర్(KCR)ల సర్టిఫికెట్ అవసరం లేదని కిషన్రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS)లు అవినీతి, కుటుంబ పార్టీలని ఆరోపిస్తూ, వారిద్దరూ ‘బ్యాడ్ బ్రదర్స్’ అని విమర్శించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
కిషన్రెడ్డి తన విమర్శలను కొనసాగిస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి గెలిచాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్లు కక్కిస్తామన్న హామీ ఏమైందని, కనీసం ఒక్క రూపాయి అయినా కక్కించారా అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ, కేసీఆర్ను కాపాడుతున్నారని, అందుకే బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ‘ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్’ గా అభివర్ణించిన కిషన్రెడ్డి, రేవంత్ తెలంగాణకు పట్టిన ‘శాపం’ అని, తెరవెనుక రాజకీయాలు చేయడంలో ఆయన దిట్ట అని తీవ్రంగా విమర్శించారు.








