పరకామణి కేసు.. ఐదు టీమ్‌లతో దర్యాప్తు – సీఐడీ డీజీ

పరకామణి కేసు.. ఐదు టీమ్‌లతో సీఐడీ దర్యాప్తు

తిరుపతి (Tirupati)లో పరకామణి (Parakamani) స్కాం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ (CID) డీజీ (DG) రవిశంకర్ అయ్యన్నార్ (Ravishankar Ayyannar) మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు ఈ కేసులో విస్తృత విచారణ చేపట్టామని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 2 లోపు పరకామణి కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా ఐదు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందితో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

సీఐడీ ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గిఫ్ట్ డీడ్‌ల డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజీలు సేకరిస్తోంది. 1985లో జీయర్ మఠంలో విధుల్లో చేరిన రవికుమార్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆయన పేరుతో కర్ణాటక, హైదరాబాద్, తమిళనాడులో ఉన్న విలువైన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతున్నదని రవిశంకర్ వెల్లడించారు. రవి కుమార్ ఆదాయానికి మించి ఆస్తులపై ఏసీబీ కూడా సమాంతరంగా దృష్టి సారించిందన్నారు.

పరకామణి స్కాం సంబంధిత సమాచారం ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ కోరింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9440700921 మరియు ఇమెయిల్‌ ఐడీ apgcid@ap.gov.in అందుబాటులో ఉంచారు. అందించిన వివరాలను రహస్యంగా ఉంచుతామని రవిశంకర్ హామీ ఇచ్చారు. తిరుపతిలో సీఐడీ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు.

“పరకామణి వద్ద కొంతమంది సిబ్బంది సరైన చెకింగ్ లేకుండా వ్యవహరించడంతో ఈ స్థితి వచ్చింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో డేటా సేకరిస్తున్నాం. టిటిడి బోర్డు, పోలీసులు, బ్యాంకు అధికారులు ఇలా అందరినీ విచారిస్తున్నాం” అన్నారు. కాగా, రవి కుమార్ టిటిడి‌కు 14 కోట్లు విలువైన ఆస్తులను ఇచ్చినా, వాటి మార్కెట్ విలువ 45 కోట్లు పైగా ఉంటుందని సీఐడీ అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment