ఆన్‌లైన్ గేమింగ్‌కు కానిస్టేబుల్ బ‌లి.. రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌

ఆన్‌లైన్ గేమింగ్‌కు కానిస్టేబుల్ బ‌లి.. రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌

ఆన్‌లైన్ గేమ్స్ అనే వ్యసనం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈసారి ఆ బాధితుడు సామాజిక భద్రత కోసం పనిచేసే పోలీస్ కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రానికి చెందిన కటారి సందీప్ కుమార్ (25) సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్ పట్ల వ్యసనం పెరగడంతో, ఆయన లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయినట్లు సమాచారం. అప్పు తీర్చలేక నిరాశకు గురైన సందీప్ చివరికి మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చనిపోయే ముందు సందీప్ “వెల్‌విషర్స్” పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, తన తల్లికి, చెల్లికి క్షమాపణలు తెలిపే సూసైడ్ నోట్ పంపాడు. “నా వల్ల అమ్మ, చెల్లి ఇబ్బంది పడ్డారు.. సారీ అమ్మ, చెల్లి” అంటూ ఆ చివరి సందేశంలో పేర్కొన్నాడు. ఈ నోట్ చదివిన తర్వాత సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.

సందీప్ ఆత్మహత్యకు పాల్పడిన రివాల్వర్ ఎక్కడి నుండి వచ్చిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమ్స్ పట్ల పెరుగుతున్న మోజు ఎంతటి ప్రమాదకరమో మరోసారి చాటి చెప్పింది. యువత ఆన్‌లైన్ గేమింగ్ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment