చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్

చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్

తెలంగాణ (Telangana)లోని చేవెళ్ల (Chevella)దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ బస్సు(RTC Bus)ను కంకర లారీ (Gravel Lorry) ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటన చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు.

మరోవైపు, చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో బీజాపూర్ హైవేపై వాహనాలను దారి మళ్లించారు. తాండూర్, వికారాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శంకర్పల్లి మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment