‘బాబులో భయం’.. జోగి అరెస్టుపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

'బాబులో భయం'.. జోగి అరెస్టుపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అరెస్టు(Arrest)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ రాజకీయాల్లో (Diversion Politics) భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. జోగి రమేష్ సీబీఐ విచారణ (CBI Investigation) కోరుతూ హైకోర్టు (High Court)లో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టు చేయడం వెనుక చంద్ర‌బాబు(Chandrababu)లో భయం క‌నిపిస్తోందంటూ చుర‌క‌లు అంటించారు.

“చంద్రబాబూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు (Fake Liquor Factories) బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడి మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు” అని జగన్ పేర్కొన్నారు.

గత 18 నెలలుగా ప్రభుత్వం చంద్రబాబు ఆధీనంలో ఉందని, పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీదారులు, అమ్మకందారులు అందరూ టీడీపీ(TDP)కి చెందిన వారేనని జ‌గ‌న్ తెలిపారు. “తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కానీ బురదజల్లేది మాత్రం మావాళ్లని. ఇది ఎంత దారుణం?” అని ప్రశ్నించారు. “మీరు తీసుకువచ్చిన ప్రైవేటు లిక్కర్ షాపులు, బెల్టు షాపులే ఈ అక్రమ మద్యం వ్యాపారానికి కేంద్రాలు” అని జ‌గ‌న్ ఆరోపించారు.

కాశీబుగ్గ ఆలయం (Kasibugga Temple)లో తొక్కిసలాట (Stampede) ఘటన, మోంథా తుపాను (Montha Cyclone)తో రైతులు (Farmers) ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ అరెస్టు చేశారని అన్నారు. “జోగి రమేష్ సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టు చేయడం, మీ భయాన్ని చూపిస్తోంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. మీ మాఫియా విచారణను మీరు చేయించుకోవడం హాస్యాస్పదం” అని జగన్ వ్యాఖ్యానించారు.

“ఇలాంటి రాక్షస పాలనలో ప్రజల భవిష్యత్తు ఏమిటి? చట్టం, న్యాయం అన్న మాటలు చంద్రబాబు నాయుడి పాలనలో కనుమరుగైపోయాయి” అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment