బీహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికలకు (Elections) సమయం దగ్గరపడుతున్న వేళ, తాజా జేవీసీ ఒపీనియన్ పోల్ (JVC Opinion Poll)సంచలన ఫలితాలను వెల్లడించింది. 243 సీట్లకు గాను నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్న పోలింగ్, నవంబర్ 14న వెలువడనున్న ఫలితాల కోసం అధికార ఎన్డీయే(NDA) (బీజేపీ+జేడీయూ) కూటమి మరియు ప్రతిపక్ష మహాఘటబంధన్ (ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాలు) కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ఈ సర్వే ప్రకారం, రెండు కూటముల మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ, అధికార ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి 120 నుంచి 140 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా, మహాఘటబంధన్ కూటమి 93 నుంచి 112 సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
పార్టీల వారీగా చూస్తే, ఎన్డీయేలో బీజేపీ 70-81 సీట్లు, జేడీయూ 42-48 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే తెలిపింది. ప్రతిపక్ష కూటమిలో ఆర్జేడీ 69-78 సీట్లు, కాంగ్రెస్ 9-17 సీట్లు మరియు వామపక్షాలు 14-17 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూసినా ఎన్డీయే 41% – 43% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మహాఘటబంధన్ 39% – 41% ఓట్లు పొందవచ్చని ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఈ లెక్కన బీహార్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి రెండు కూటముల మధ్య చివరి వరకు తీవ్రమైన పోటీ తప్పదని స్పష్టమవుతోంది.







