శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. మీడియా సమాచారం ప్రకారం ఇప్పటివరకు పది మందికి పైగా భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోందని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
“బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. గాయపడిన భక్తులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మా పార్టీ నాయకులను ఇప్పటికే ఆదేశించాను” అని జగన్ తెలిపారు.
అలాగే, తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మంది, సింహాచలం ఘటనలో 7 మంది, ఇప్పుడు కాశీబుగ్గలో 10 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. “గత 18 నెలల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. చంద్రబాబు అసమర్థ పాలన భక్తుల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇకనైనా ప్రభుత్వం కళ్లుతెరచి తప్పులను సరిదిద్దుకోవాలి” అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.







