అనకాపల్లి (Anakapalli) జిల్లాలో మద్యం దుకాణాల (Liquor Shops) యజమానులు (Owners) ఈరోజు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వ్యాపారాలు కొనసాగించే పరిస్థితి లేకుండా పోయిందంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. “ఇలాగైతే మేము వ్యాపారం చేయలేం”, “మా సమస్యలు పరిష్కరించండి” అంటూ నినాదాలు చేశారు. వ్యాపార నష్టాలతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన షరతులతో వ్యాపారం చేయడం అసాధ్యమని తెలిపారు.
ఈ సందర్భంగా మద్యం దుకాణాల యజమానులు తమ దుకాణాల తాళాలు వేసి జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించారు. మార్జిన్‌ను కనీసం 20 శాతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత లాభాలు తక్కువగా ఉండడం వల్ల సిబ్బంది జీతాలు, అద్దెలు, పన్నులు భరించడం కష్టమైందని వారు వివరించారు.
“మా సమస్యలను అధికారులు పట్టించుకోకపోతే ఇకపై దుకాణాలు మూసివేసి నిరవధికంగా ఆందోళన చేస్తాం” అని హెచ్చరించిన నిర్వాహకులు, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం (Excise Office) ఎదుట జరిగిన ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) October 17, 2025
ఇలాగైతే మద్యం వ్యాపారం చేయలేం..
అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన
వ్యాపారాలు చేయలేమంటూ మద్యం దుకాణాల యజమానులు నిరసన
మద్యం దుకాణాలు తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించిన యజమానులు
మార్జిన్ 20శాతం అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు… pic.twitter.com/p87dy3j6du








