శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని

భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు చేరుకున్న ప్రధాని కి గవర్నర్ (Governor), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల మల్లికార్జున స్వామిని (Srisailam Mallikarjuna Lord) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ నజీర్ (Nazir) తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. శ్రీశైలంలో ప్రధాని మోడీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న దర్శనం అనంతరం ప్రధాని మోడీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.

రాగ‌మ‌యూరి స‌భ ప్రాంగ‌ణానికి చేరుకున్న ప్ర‌ధాని మోడీ.. ప్ర‌జ‌లనుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ప్ర‌సంగం అనంత‌రం శ్రీశైలంలో పర్యటనను ముగించుకొని, సున్నిపెంట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ప్రధాని మోడీ తిరిగి కర్నూలుకు బయలుదేరారు. కర్నూలు లోని నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:05 గంటలకు ఈ బహిరంగ సభ జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment