ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను సహించలేకపోతున్నారని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ (Diversion Politics) ప్రారంభించారని పేర్కొన్నారు.
లిక్కర్ కేసు (Liquor Case)పై మాట్లాడుతూ, ఇది ఒక ‘పుష్పక విమానం’ లాంటిదని, కేసులు పెడుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. లిక్కర్ అక్రమ కేసుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ‘బేతాళ కథలు’ అల్లుతోందని ఆరోపించారు. సిట్ నేరారోపణలు చేస్తోందే తప్ప, సరైన ఆధారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్‌లో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, చంద్రబాబు (Chandrababu) అల్లిన కథకు సిట్(SIT) అద్భుతమైన కథనాలు అల్లుతోందని విమర్శించారు.
లిక్కర్ అక్రమ కేసులో రూ.50 వేల కోట్ల నుంచి రూ.11 కోట్లకు నష్టం తగ్గిందని పేర్కొంటూ, ‘భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు చంద్రబాబు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.