కేంద్ర కేబినెట్ (Central Cabinet) మంగళవారం జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్ (Betting Apps)లపై నియంత్రణ కోసం ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) బిల్లు (Bill)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లపై కట్టడి పెరగనుంది. అదే విధంగా రాజస్థాన్‌లోని కోటా-బుందిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ (Green Field) ఎయిర్‌పోర్ట్ (Airport) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1,507 కోట్లు కాగా, 440.06 హెక్టార్ల భూమిని రాజస్థాన్ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందజేయనుంది.
అదేవిధంగా ఒడిశా (Odisha) రాష్ట్రంలో కటక్-భువనేశ్వర్ (Cuttack-Bhubaneswar) రింగ్ రోడ్(Ring Road) నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను ఆరు లేన్ల రహదారిగా నిర్మించనున్నారు. దాదాపు రూ.8,307 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఈ నిర్ణయాలతో ఆ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కానుంది.








