భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindur) లో అమరులైన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ (22) జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఒక సినిమా నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
బిగ్ బాస్ ఫేమ్ (Fame) గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో మురళీ నాయక్ (Murali Nayak) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నట్లు నిర్మాత కె. సురేష్ బాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్ భారత దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య ఘట్టం. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కథను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీస్తున్నాం” అని తెలిపారు.
ఈ చిత్రం కోసం మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రకటన కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లి తండాకు చెందిన మురళీ నాయక్… ఆపరేషన్ సింధూర్ సమయంలో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉండగా వీరమరణం పొందారు.