తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) నేడు సమావేశం (Meeting) కానుంది. సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం (Secretariat)లో కేబినెట్ భేటీ జరగనుంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సలహాదారులు తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే అన్ని శాఖల కార్యదర్శులకు సర్క్యూలర్ జారీచేసిన సీఎస్, చర్చించాల్సిన అంశాలపై సాధారణ పరిపాలన విభాగానికి (GAD) అజెండా ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా కులగణన నివేదిక, బీసీ ఆర్డినెన్స్, గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు, గోశాల పాలసీ వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలోని కొత్త జూనియర్ కళాశాలల పోస్టుల భర్తీకి కేబినెట్ నుంచి ఆమోదం లభించవచ్చనన్న అంచనాలు ఉన్నాయి. మత్స్యకార సహకార సంఘాల ఇంచార్జీల నియామకం, వర్షాకాలంలో యూరియా అందుబాటు, డిమాండ్‌పై సమీక్ష కూడా జరగనుంది. అదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై, నిధుల సమీకరణపై, విద్యుత్ సంస్థల అక్రమాలపై అందిన నివేదికలపై కూడా కేబినెట్ సమీక్షించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీ. చంద్రఘోష్ కమిషన్ ఇచ్చే నివేదికపై చర్చ కూడా జరిగే అవకాశముంది.