సైబ‌ర్ నేరాల‌కు టీటీడీ చెక్‌.. బోర్డ్ మీటింగ్‌లో కీల‌క నిర్ణ‌యాలు

సైబ‌ర్ నేరాల‌కు టీటీడీ చెక్‌.. బోర్డ్ మీటింగ్‌లో కీల‌క నిర్ణ‌యాలు

పాలకమండలి (Governing body) సమావేశంలో (Meeting) తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) బోర్డ్‌ (TTD Board)పలు కీలక నిర్ణయాలు (Key Decisions) తీసుకుంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన పాల‌కమండ‌లి స‌మావేశంలో భక్తుల సౌకర్యాలు, వసతులపై ప్రధానంగా చర్చలు సాగాయి. ముఖ్యంగా వైకుంఠం (Vaikuntham) క్యూ కాంప్లెక్స్ 3 (Queue Complex 3) నిర్మాణంపై కమిటీ (Committee)ని ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తులకు వసతి దొరకక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఉచిత సముదాయ వసతిగృహాల నిర్మాణం చేపడతామని పాలకమండలి స్పష్టం చేసింది. శ్రీవాణి ట్రస్ట్ (SriVani Trust) ద్వారా వచ్చే యాత్రికులకు వసతి నిర్మాణానికి సంబంధించి కమిటీ నివేదిక ఆధారంగా దశల వారీగా చర్యలు తీసుకోనున్నారు.

తిరుమల అలిపిరి (Alipiri) మెట్టు మార్గాల్లో మెరుగైన సౌకర్యాలు, శిలాతోరణం ఆధునీకరణ, పడిపోయిన వసతిగృహాల పునర్నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా టీటీడీ ఆలయాలు నిర్మించడంపై కార్యాచరణ జరుగుతుండగా, విదేశాల్లో కూడా ఆలయాల నిర్మాణంపై చర్చ సాగింది. భక్తులకు పూజల సమయంలో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న తీర్మానం చేశారు. ఇటీవల ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల నివారణకు టీటీడీ సైబర్ (Cyber) సెక్యూరిటీ (Security) విభాగం ఏర్పాటుపై చర్చించి దానిపై కార్యాచరణ చేపట్టనున్నారు.

అంతేగాక, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి (Sri Kodanda Ramaswamy’s) ఆలయం (Templeలో అన్నప్రసాద భవనం నిర్మాణానికి అనుమతి ఇవ్వడం, అన్నమయ్య తాళ్లపాక అభివృద్ధికి చర్యలు, వేదపారాయణ దారులకు రెండు విధాలుగా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయాలు తీసుకున్నారు. 600 మంది వేదపారాయణ దారులకు నిరుద్యోగ భృతిని మంజూరు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి మూడు స్థాయిలు (రూ. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు) బడ్జెట్‌లుగా అంగీకారం తెలిపారు. కడపలోని శివాలయ అభివృద్ధి, టీటీడీలోని 142 మంది డ్రైవర్లను పర్మనెంట్ చేయాలన్న సిఫారసును ప్రభుత్వానికి పంపడం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాల్లో భాగంగా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment