‘ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే.. ఆంధ్రానే అమ్మాలి’

ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి - మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

కూట‌మి ప్ర‌భుత్వ‌ (Coalition Government) సూపర్ సిక్స్ (Super Six) హామీల్లో (Promises) భాగమైన ఆడబిడ్డ నిధి (Aadabidda Nidhi) పథకం (Scheme)పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjaraapu Acchennayudu) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విజయనగరం (Vizianagaram) జిల్లా కొత్తవలస(Kottavalasa) మండలం మంగళపాలెంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన “ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలిష అంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి మినహా మిగిలిన హామీలన్నీ నెరవేర్చామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, ప్రజలు, విపక్ష నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్య‌క్తం అవుతున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని టీడీపీ విమర్శించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్వయంగా ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఆంధ్రాన్ని అమ్మాలని చెప్పడం దారుణమని, సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోయినా అన్నీ చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ప్రజలు విమ‌ర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.

ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆడబిడ్డ నిధి పథకం కింద రూ.1,500 నెలవారీ సాయం అందించాలన్న హామీ ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రధాన హామీల్లో ఒకటిగా ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాల‌ని వ్యాఖ్యానించ‌డం ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment