‘వార్ 2’ నుంచి పోస్టర్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్

'వార్ 2' నుంచి పోస్టర్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War) 2నుంచి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. 2019లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)) కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈసారి కథనం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని అంచనాలున్నాయి. హృతిక్ రోషన్ మళ్లీ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ తొలిసారిగా హిందీ చిత్రంలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారు.

ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తుండగా, యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా (Aditya Chopra) అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, తాజాగా కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కొత్తగా విడుదలైన ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ (NTR) పవర్‌ఫుల్ (Powerful) లుక్‌ (Look)లో కనిపించారు. మాస్క్‌తో, టెన్నింగ్ గ్లాసెస్ ధరించి, బ్లాక్ గేర్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్ అభిమానులకు మాస్ హై ఇచ్చింది. ఆయన స్వయంగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్‌ను పంచుకోవడం మరో హైలైట్. ఈ లుక్‌పై అభిమానులు “విలన్ అయినా వీర్‌గా ఉన్నాడు”, “డార్క్ షేడ్స్‌లో ఎన్టీఆర్ ఓ రేంజ్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment