రామాయణం: అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం

రామాయణం: అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం

మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, (Monster Mind Creations) ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ (Prime Focus Studios) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రెండు భాగాల ‘రామాయణం’  (‘Ramayanam’) చిత్రానికి సుమారు ₹4,000 కోట్లు (500 మిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా నిలవనుంది. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం కూడా ₹1,000 కోట్ల బడ్జెట్‌ను దాటలేదు.

నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, “పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు (₹4,000 కోట్లు) అవుతుంది. రామాయణం ప్రపంచం చూడవలసిన గొప్ప కథ. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను” అని అన్నారు.

ప్రపంచస్థాయి చిత్రం, బహుళ భాషల్లో విడుదల
ఈ చిత్రం హాలీవుడ్‌లోని బ్యాట్‌మన్, సూపర్‌మెన్, వండర్‌వుమన్ వంటి డీసీ కామిక్స్ చిత్రాలతో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రూపొందించబడుతోంది. ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా, రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర గ్లింప్స్‌ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, గ్రాఫిక్స్ పనితీరుపై ప్రశంసలు అందుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment