ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఢిల్లీకి చేరిన బనకచర్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ (Andhra Pradesh–Telangana) రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి పంచాయితీ (Water Dispute)  ఇప్పుడు ఢిల్లీ (Delhi) దాకా వెళ్లింది. ముఖ్యంగా పోలవరం(Polavaram), బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుల  (Projects’) నిర్వహణ, వాటి ద్వారా జరిగే నీటి పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ (Central Jal Shakti Department) రంగప్రవేశం చేసింది.

సీఎంలతో సమావేశానికి కేంద్ర లేఖలు
పోలవరం ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు, బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన కేంద్రం, ఈ అంశంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Chief Ministers) సమావేశం(Meeting) నిర్వహించనుంది. రేపు (మంగళవారం) ఢిల్లీలో ఈ భేటీ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)లకు ఇప్పటికే కేంద్రం నుంచి అధికారిక ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.

ఢిల్లీకి చంద్రబాబు పర్యటన
ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, కేంద్రం నిర్వహించే సమావేశానికి ఆయన పాల్గొనబోతున్నారా? లేదా? అన్న విషయంపై ఇంకా అధికారిక సమాధానం వెలువడలేదు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుపైనా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సమావేశంలో నీటి పంపిణీ నిబంధనలు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు, అభివృద్ధి పనుల ఆమోదాలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాల నీటి హక్కుల పరిధిలో కీలక మలుపు కావచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment