తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. అగ్ని ప్రమాదంలో మంటలు ఆకాశం ఎత్తున ఎగసిపడగా, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసి భయానక వాతావరణాన్ని సృష్టించింది. చెన్నై (Chennai) నుంచి అరక్కోణం వైపు వెళ్తున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ (Crude Oil Tanker) గూడ్స్ రైలు తిరువళ్లూరు (Tiruvallur) సమీపంలో పట్టాలు తప్పడంతో ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చమురు నిల్వలు ఉన్న ఈ రైలులోని ఎనిమిది ట్యాంకర్లు మంటలకు ఆహుతి కాగా, భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి, పరిసర ప్రాంతాలు కారు మబ్బులతో నిండిపోయాయి. ఈ ఘటనతో చెన్నై-అరక్కోణం (Chennai-Arakkonam) మార్గంలో రైల్వే సర్వీసులు పూర్తిగా స్తంభించాయి, చెన్నై నుంచి తిరుపతి, బెంగళూరు, కోయంబత్తూరు, వేలూరు, సేలం మార్గాల్లో రైళ్లు నిలిచిపోయాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ప్రమాదం తిరువళ్లూరు జిల్లాలోని ఎగత్తూరు సమీపంలో సంభవించింది. గూడ్స్ రైలులో మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా, ఇంజన్ నుంచి రెండవ ట్యాంకర్ నుంచి తొమ్మిదో ట్యాంకర్ వరకు పట్టాలు తప్పడంతో ఎనిమిది ట్యాంకర్లు (ఒక్కో ట్యాంకర్‌లో 70,000 లీటర్ల క్రూడ్ ఆయిల్) అగ్నికి ఆహుతి అయ్యాయి. మిగిలిన 40 ట్యాంకర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసి మళ్లించారు. మంటలను ఆర్పేందుకు తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, గుమ్మడిపూండి, వేలూరు నుంచి ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగినప్పటికీ, సరైన రహదారి మార్గం లేకపోవడం, వర్షం కారణంగా అగ్నిమాపక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తిరువళ్లూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌లోని 300 కుటుంబాలను జిల్లా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సంఘటనా స్థలానికి తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టి. ప్రభుశంకర్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) విశ్వనాథన్ చేరుకుని రక్షణ, అగ్నిమాపక చర్యలను పర్యవేక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అగ్నిమాపక, రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలతో సమన్వయం చేస్తున్నారు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను విచారించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ప్రస్తుతం రైలు మార్గాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి, అయితే వర్షం కారణంగా ఈ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు.
భారీగా ఎగసిపడుతున్న మంటలు
— Telugu Feed (@Telugufeedsite) July 13, 2025
ఇప్పటి వరకు ఏడు ట్యాంకర్లు అగ్నికి ఆహుతి
చెన్నై నుంచి తిరుపతి బెంగళూరు కోయంబత్తూర్ వైపుగా వెళ్లి అన్ని రైలు సేవలు నిలిపివేత
మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు తీవ్ర ఇబ్బందులు, మార్గం లేక అవస్థలు#FireAccident #trainaccident https://t.co/HoZBmfW4vb pic.twitter.com/Fi3AYJkeyZ