రైతుల‌ను రౌడీషీట‌ర్లుగా చిత్రీక‌రిస్తారా..? కూట‌మిపై జ‌గ‌న్ ఫైర్‌

రైతుల‌ను రౌడీషీట‌ర్లుగా చిత్రీక‌రిస్తారా..? కూట‌మిపై జ‌గ‌న్ ఫైర్‌

కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) మామిడి రైతుల (Mango Farmers) నిర్ల‌క్ష్యం చేస్తూ, వారి గోడును ప‌ట్టించుకోకుండా నిద్ర‌పోతోంద‌ని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యం (Bangarupalyam)లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. మార్కెట్ యార్డులో మామిడి రైతులను కలిసి, వారిని ప‌రామ‌ర్శించారు. మామిడి ధ‌ర‌ల‌పై ఆరా తీశారు. ఏడాది పొడ‌వునా పండించిన మామిడి పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌ల్లేక 76 వేల మంది మామిడి రైతులు (Farmers) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయార‌న్నారు.

మామిడి రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాను వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌గా, పోలీసులు హ‌డావుడిగా ఆంక్ష‌లు సృష్టించి, బంగారుపాళ్యం వ‌చ్చే రైతుల‌ను రౌడీషీట‌ర్లు (Rowdy-Sheets)గా చిత్రీక‌రిస్తున్నార‌ని మండిపడ్డారు. కూటమి ప్ర‌భుత్వం రైతుల‌పై కూడా రౌడీషీట్లు ఓపెన్ చేయిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం రైతులను అడ్డుకోవడం, పోలీసులను మొహరించి సమావేశానికి వచ్చే వారిని బెదిరించడం దారుణమని, అయినప్పటికీ వేలాది మంది రైతులు తమ ఆవేదనను చెప్పుకునేందుకు బంగారుపాళ్యం వ‌చ్చార‌న్నారు వైఎస్ జ‌గ‌న్‌.

మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్‌సీపీ పాలనలో మామిడి కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముడుపోగా, ప్రస్తుత ప్రభుత్వంలో కిలో రూ.2 నుంచి రూ.4కు పడిపోయిందని, ఇది రైతుల జీవనోపాధిని దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కిలో రూ.16 గిట్టుబాటు ధర అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ప్రభుత్వం ప్రకటించిన రూ.4 సబ్సిడీ కూడా సకాలంలో అందడం లేదని, ఈ వైఫల్యం రైతులను నిరాశకు గురిచేస్తోందని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో 6.45 లక్షల టన్నుల మామిడి పంట సాగు చేస్తున్న 76 వేల మంది రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, 52 పల్ప్ కంపెనీలు ఉన్నప్పటికీ కొనుగోళ్లలో జాప్యం, ధరల తగ్గింపు వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జగన్ విమర్శించారు.

వైసీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలిచామని, అప్పట్లో ఇన్‌పుట్ సబ్సిడీలు, సకాలంలో కొనుగోళ్లు జరిగేవని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం మేల్కొని, మొత్తం మామిడి పంటను స్వయంగా కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని జగన్ హెచ్చరించారు. పోలీసులు 1200 మంది రైతులను అడ్డుకోవడం, ఒకరి తలపై దాడి చేయడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల సమస్యలపై తాను ఎల్లప్పుడూ మాట్లాడుతానని, రైతుల గొంతుకగా నిలబడతానని జగన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment