ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వ బాలిక హాస్టల్స్ (Government Girl Hostel)లో వరుస సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి (Anakapalli)లో భోజనం (Food)లో బొద్దింక (Cockroach), నిన్న శ్రీకాళహస్తి (Srikalahasti)లో ఉప్మా (Upma)లో జెర్రీ (Centipede), నేడు శ్రీసత్యసాయి (Sri Sathya Sai) జిల్లాలో కల్తీ ఆహారం ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విద్యాశాఖ అలసత్వానికి అద్దం పడుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శాఖలో నిర్లక్ష్యం కొనసాగుతోందని మండిపడుతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల వసతి గృహంలో శుక్రవారం జరిగిన ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఆందోళన కలిగించింది. కలుషిత ఆహారం తినడం వల్ల 70 మంది విద్యార్థినులు (Girl Students) వాంతులు (Vomiting), విరేచనాలతో అస్వస్థత (Illness)కు గురయ్యారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వరుస ఘటనలు రాష్ట్రంలో వసతి గృహాల ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించకుండా వసతి గృహంలోనే అరకొర చికిత్స అందించడం. అధికారులు విద్యార్థినులను నేలపై పడుకోబెట్టి సెలైన్ బాటిళ్లు ఎక్కించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వసతి గృహాల్లో ఆహార సురక్షిత ప్రమాణాలపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు.








