నటి ప్రియాంక చోప్రా గతంలో ‘వర్జినిటీ’ గురించి వ్యాఖ్యలు చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. “వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు.. మంచి గుణాలు ఉన్న అమ్మాయిని చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ క్యారెక్టర్, సంస్కారం ఎప్పటికీ ఉండిపోతాయి” అనే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ప్రియాంక చోప్రా చేసిందంటూ అనేక పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. అయితే తాజాగా ఈ కామెంట్స్‌పై ప్రియాంక స్పందించింది.
“అవి ఫేక్ పోస్టులు, నాకు సంబంధం లేదు”
ప్రియాంక చోప్రా ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఇప్పుడున్న ఆన్లైన్ యుగంలో ఇలాంటి ఫేక్ పోస్టులు సాధారణమైపోయాయి. నేను ఆ కామెంట్స్ చేయలేదు. వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను చేసుకోవాలనేది నేను ఎప్పుడూ చెప్పలేదు. నా పేరు మీద ఇలాంటి ఫేక్ పోస్టులు రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా చాలా ఫేక్ పోస్టులు వేశారు” అని స్పష్టం చేసింది.
“ఫేమస్ అవ్వడానికి రూమర్లు సులభం”
“ఫేమస్ అవ్వడం కోసం, వైరల్ కావడం కోసం ఇలాంటి రూమర్లు క్రియేట్ చేయడం చాలా సులభమైపోయింది. నేను అబ్బాయిలను కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదు. అందరూ సమానమే అని ఎప్పుడూ చెబుతుంటాను” అంటూ ప్రియాంక వివరణ ఇచ్చింది. అయితే, ఈ ప్రచారం దేశమంతా జరిగిపోయిన తర్వాత ఆలస్యంగా స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని కొందరు నెటిజన్లు అభిప్రప్రాయపడుతున్నారు.