జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు భారీ జరిమానా

జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు భారీ జరిమానా

Summarize with AI


2006లో జర్మనీ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య (DFB)కి 1,28,000 డాలర్లు (సుమారు రూ. 1 కోటీ 10 లక్షలు) జరిమానా విధించింది ఫ్రాంక్‌ఫర్ట్‌ స్థానిక కోర్టు. సుదీర్ఘ వాదనల అనంతరం బుధవారం ఈ తీర్పును వెల్లడించింది.

2005లో, అంటే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఒక ఏడాది ముందు, ఫిఫా నిర్దేశించిన పన్నులు చెల్లించడంలో జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య విఫలమైందని కోర్టు నిర్ధారించింది. ప్రపంచకప్‌ ప్రారంభోత్సవం కోసం తీసుకున్న రుణాన్ని దాచిపెట్టిన DFB, ఒక ఏడాది తర్వాత దానిని వ్యాపార ఖర్చుగా తప్పుగా చూపించి, ఆపై రద్దు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పన్ను ఎగవేత తీవ్రతను పరిగణనలోకి తీసుకుని భారీ మొత్తంలో జరిమానా విధించాలని ఫిఫా తరఫు న్యాయవాదులు వాదించారు.

ఈ మొత్తం వ్యవహారంలో సంబంధం ఉన్న జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రతినిధులు జ్వాన్జిగర్, వోల్ఫ్‌గ్యాంగ్, నీర్స్‌బాచ్, హోర్ట్స్‌ స్మిత్‌లపై తొలుత అభియోగాలు మోపారు. అయితే, వారిపై మోపిన ఆరోపణలను ఖండించిన ఈ ముగ్గురూ, జరిమానాలు చెల్లించిన తర్వాత వారిపై ఉన్న విచారణలను రద్దు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment