అఖిల్ సినిమా నుంచి శ్రీలీల ఔట్? కారణం అదేనా!

అఖిల్ సినిమా నుంచి శ్రీలీల ఔట్? కారణం అదేనా!

టాలీవుడ్‌ (Tollywood)లో కొద్దికాలం క్రితం వరకు వరుస చిత్రాలతో సందడి చేసిన శ్రీలీల (Sreeleela), ప్రస్తుతం తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆశించిన స్థాయిలో హిట్స్ లేకపోయినప్పటికీ, ఆమె ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఆమె అక్కినేని అఖిల్ (Akkineni Akhil) సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే?

‘లెనిన్’ నుంచి తప్పుకుందా?
శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉన్నాయి. తెలుగులో అఖిల్ సరసన ‘లెనిన్’ (Lenin) అనే చిత్రంలో కూడా నటిస్తుందని గతంలో ప్రకటించారు. ఈ ఏప్రిల్‌లో అఖిల్-శ్రీలీల జంటగా కనిపించనున్నారంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసి అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, శ్రీలీల ఎక్కువ డేట్స్ హిందీ, తమిళ చిత్రాలకే కేటాయిస్తుండటంతో, ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను చూసుకోవాలని ‘లెనిన్’ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

శ్రీలీల ప్రస్తుత ప్రాజెక్టులు
శ్రీలీల చివరగా తెలుగులో ‘రాబిన్ హుడ్’ చిత్రంలో కనిపించింది. త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా, పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. హిందీలో ‘ఆషికి 3’, తమిళంలో ‘పరాశక్తి’ చిత్రాలు చేస్తోంది. ఆమె నటించిన కన్నడ చిత్రం ‘జూనియర్’ విడుదల కావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment